• Door No:43/34, Sri Rajamatha Nilayam, Prakash Nagar, Kadapa

HRCCI HRCCI - Human Rights

SINGAMALA VENKATA RAMANAIAH

కీర్తిశేషులు శ్రీమతి సింగమాల గంగమ్మ మరియు కీర్తి శేషులు శ్రీ సింగమాల పిచ్చయ్య గార్లకు సింగమాల వెంకట రమణయ్య గారు 19.03.1961 తేదీన మూడవ సంతానంగా పోలీస్ క్వార్టర్స్ కడప నగరం నందు జన్మించారు.

ఇతని బాల్య దశ ఆరవ తరగతి వరకు కడప నగరం నందు, ఏడవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు రైల్వే కోడూరు, తర్వాత డిగ్రీ బిఎస్సి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ కడప నగరముందు తర్వాత తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు.

project-slider-image

బ్రాంచ్ మేనేజర్ - రాయలసీమ గ్రామీణ బ్యాంక్

ఎమ్మెస్సీ రెండవ సంవత్సరంలో చదువుతున్నప్పుడే రాయలసీమ గ్రామీణ బ్యాంకు నందు బ్రాంచ్ మేనేజర్ గా సెలెక్ట్ అవ్వడం, 02.04.1987 చేరడం జరిగినది. అదే గ్రామీణ బ్యాంకు లో సుదీర్ఘంగా 34 సంవత్సరములు మేనేజర్ గా పని చేసి { బడుగు బలహీన వర్గాల వారి సాంఘిక సేవ మరియు సాంఘిక న్యాయం కోసం తన స్వలాభాన్ని వదులుకొని } మేనేజర్ గానే కడప నగరము 31.03.2021 నందు రిటైర్ అవ్వడం జరిగినది.
గుంటూరు వాస్తవ్యులు కీర్తిశేషులు శ్రీ మతి పసల సౌరీలు మరియు కీర్తిశేషులు శ్రీ మేరీగ మరియదాసు గారి మూడవ సంతానమైన లావణ్య { లిల్లీ బెర్నాదత్ } అనే కన్యను 17.12.1989 వివాహం చేసుకోవడం అయినది. శ్రీ రమణ గారికి నలుగురు ఆడ సంతానం

  • డాక్టర్ ఎస్. సాయి కృష్ణ శ్రీ { అల్లుడు డాక్టర్ టి. కార్తీక్ }
  • డాక్టర్ ఎస్. దివ్య గౌతమి
  • ఎస్. శ్రీ పూజిత
  • డాక్టర్ ఎస్. చరిత నందిని.

తన కాలేజీ లైఫ్ నుండి ఇతరులకు సహాయ సహకారాలు అందించడం, తన వంతు సహాయం చేయడం అందరి మన్ననలు పొందుతూ తన వ్యక్తిగత పనులను కూడా పక్కన పెట్టి పని చేసేవాడు. ఇలా ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజుల్లో విద్యార్థి నాయకుడిగా, బ్యాంకు లో మూడు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా, మూడు గ్రామీణ బ్యాంకు {అనంత ,పినాకిని, రాయలసీమ} లకు కన్వీనర్గా పని చేయడం తన పనిచేసే కాలంలో 196 గ్రామీణ బ్యాంకులలో ఎస్సీ ఎస్టీ వారికి పదోన్నతులలో రిజర్వేషన్లు లేకపోతే తన సొంత ఖర్చులతో హైదరాబాదులోని హైకోర్టుకు వెళ్లి రిజర్వేషన్ పాలసీని తీసుకు రావడం జరిగినది . అదే హైకోర్టు ఆర్డర్ తో దేశంలోని 196 గ్రామీణ బ్యాంకులలో పదోన్నతులలో రిజర్వేషన్ ఇవ్వడం జరిగినది. యాజమాన్యం నుండి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా భయపడకుండా ధైర్యంగా బ్యాంకు చైర్మన్ పైనే హైకోర్టులో మూడు దఫాలుగ రిట్ వేసి ,కేసు వాదించి మూడు కేసులలో విజయం సాధించడం జరిగినది.

బ్యాంకులో ఎస్సీ ఎస్టీ వారికి బ్యాక్ లాగులు ఫిల్ అప్ చేయడం, చెకప్ ఆఫ్ ఫెసిలిటీ ఇప్పించడం, మూడు నెలలకొకసారి జాయింట్ మీటింగ్ యాజమాన్యం వారితో నాబార్డు గైడ్లైన్స్ ప్రకారం నడపడం, రిజర్వేషన్ ఉండి ఎలిజిబులిటీ వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇప్పించడం, రిజర్వేషన్స్ పైన నాయకులకు ట్రైనింగ్ ప్రోగ్రాం {రూల్ ఆఫ్ లా గురించి ట్రైనింగ్} ఇప్పించడం, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగినది. అవి ఇప్పటికీ అన్ని బ్యాంకులలో కొనసాగడం గర్వంగా చెప్పుకోదగ్గ విషయం.

బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినటువంటి S/16 ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘంలో మూడు సంవత్సరాల పాటు కడప జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కడప జిల్లా గెజిటెడ్ ఆఫీసర్స్ సంస్థ నందు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనేక మంది ఉద్యోగస్తులకు అండగా నిలబడి వారి యొక్క సమస్యలను పరిష్కరించడం జరిగినవి.

తన రిటైర్మెంట్ తర్వాత బడుగు బలహీన వర్గాల వారికి ఎలాంటి సంస్థ మంచిగా ఉంటుందో వారి కోసం తానే స్వయంగా ఈ "మానవ హక్కుల పరిరక్షణ సంస్థ" 13 మంది తో కడప నగర మునందు RgNo:: 95/2018, 06.09.2018 ఏర్పాటు చేయడం జరిగినది

ఇప్పటికి మూడు రాష్ట్రాలలోని {ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ, తమిళనాడు} సభ్యులు 1100 మంది, సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతున్న మా సంస్థ "మానవ హక్కుల పరిరక్షణ సంస్థ"

సింగమాల వెంకట రమణయ్య,

వ్యవస్థాపకులు &జాతీయ అధ్యక్షులు