• Door No:43/34, Sri Rajamatha Nilayam, Prakash Nagar, Kadapa

HRCCI HRCCI - Human Rights

Your Rights

  • ఇవి పుట్టుకతోనే ప్రతి వ్యక్తికి లభించే హక్కులు.
  • నేడు నిత్యం ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం జరుగుతూనే ఉంది.
  • జాతి, మత మౌఢ్యం వల్ల రాజకీయ కారణాల వల్ల, వ్యక్తిగత ద్వేషం వల్ల, కక్ష, కార్పణ్యాల వల్ల, మనుషుల జీవితాలకు భరోసా లేకుండా పోతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలు సర్వసాధారణమయ్యాయి.
  • ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్‌ 10న ‘విశ్వమానవ హక్కుల ప్రకటన’ ద్వారా మానవాళికి మానవ హక్కులను అందించింది.
  • అందుకే డిసెంబర్‌ 10ని ‘అంతర్జాతీయ మానవహక్కుల దినం’గా అన్నిదేశాల్లో జరుపుకొంటారు.
  • మానవ హక్కుల ఉల్లంఘనల ఫిర్యాదులను సత్వరం విచారించడానికి కోర్టులతో పాటు మనదేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో మానవహక్కుల కమిషన్‌లు ఏర్పాటయ్యాయి

  • జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ లేదా ఇతర కారణాలతో ఏవిధమైన వివక్షకు గురికాకుండా ఉండే హక్కు.
  • చిత్రహింసలు, క్రూరత్వం నుండి రక్షణ పొందే హక్కు.
  • వెట్టిచాకిరీ, బానిసత్వం వంటి దురాచాల నుండి రక్షణ పొందే హక్కు.
  • సరైన కారణం లేకుండా నిర్బంధించ బడకుండా ఉండేహక్కు. నేరస్తులుగా అనుమానిస్తున్నా, నిందితులని తేలే వరకు నిరపరాధులే.
  • ఒక అభియోగం ఆపాదించబడినప్పుడు, పక్షపాతరహితంగా విచారణ పొందే హక్కు.
  • స్వేచ్ఛగా స్వదేశంలో, విదేశాల్లో పర్యటించే హక్కు.
  • సురక్షిత ప్రాంతంలో ఏకాంతంగా జీవించే హక్కు.
  • జీవించే హక్కు.
  • సామాజిక భద్రతాహక్క.
  • భావ స్వాతంత్య్రహక్కు.
  • విద్యాహక్కు.
  • పిల్లలు ఆడుకొనే హక్కు.
  • ప్రజాస్వామ్య హక్కు.
  • కాపీరైటు హక్కు.
  • జాతీయత హక్కు.
  • ఏమతాన్నయినా స్వీకరించే హక్కు, వంటి మానవ హక్కులు ఎన్నో ఉన్నాయి.

జాతీయ మానవ హక్కుల కమీషన్

  1. 1993 OCTOBER 23న ఏర్పాటు చేసారు.
  2. NHRC స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ.
  3. 1992 లో పారీస్ దేశములో జరిగిన ప్రపంచ మానవ హక్కుల సదస్సు పిలుపు మేరకు మన దేశములో జాతీయ మానవ హక్కుల కమీషన్ ను ఏర్పాటు చేసారు.

  1. ఒక చేర్మన్, నలుగురు సభ్యులు వుంటారు.మరియు
  2. జాతీయ యస్సీ కమీషన్, జాతీయ యస్టీ కమీషన్, జాతీయ మైనార్టి కమీషన్, జాతీయ మహిళ కమీషన్ చేర్మన్లు లేదా చైర్ పర్సన్లు ,ఎక్స అఫిషియో సభ్యులు వుంటారు.
  3. సుప్రీమ్ కోర్టు మాజీ ప్రధానన్యాయ మూర్తి చేర్మన్ గా వ్యవహరిస్తారు.
  4. సుప్రీమ్ కోర్టు న్యాయమూర్తి సభ్యుడిగా,హైకోర్టు న్యాయమూర్తి ,మరో ఇద్దరు సభ్యులను మానవ హక్కులపై అనుభవము కల్గిన వారిని తీసుకొంటారు.
  5. మొదటి చేర్మన్ జస్టీస్ శ్రీ రంగనాథ మిశ్రా {1993-1996}.
  6. ప్రస్తుత చేర్మన్ గా జస్టీస్ శ్రీH.L.DATHA {29.02. 2016- STILL}.

  1. NHRC చేర్మన్, ఇతర సభ్యులను రాష్టృపతి సూచనల మేరకు కమిటిని ఏర్పాటు చేస్తారు.
  2. రాష్టృపతి కమిటీలో…
  3. చైర్ పర్సన్ గా ప్రధాన మంత్రి వుంటారు.
  4. సభ్యులు….
  5. లోకసభ స్పీకర్ ,కేంద్ర హోమ్ శాఖ మంత్రి, లోక సభా ప్రతి పక్ష నాయకుడు, రాజ్యసభా ప్రతి పక్ష నాయకుడు వుంటారు.

  1. మానవహక్కుల ఉల్లంఘన లేదా ఉల్లంఘన నివారించడములో ప్రభుత్వ ఉద్యోగి విఫలమైనపుడు ఫిర్యాదు ఆధారంగా లేదా సుమోటోగా స్వీకరించి విచారణ జరపడం.
  2. దేశము లోని జైళ్ళను సందర్శించడం,
  3. ఉగ్ర వాద నివారణకు సరైన సూచనలు ఇవ్వడం.
  4. మానవ హక్కుల పై జర్పే పరిశోధనలకు ప్రోత్సహము కల్పించడం.
  5. రాజ్యాంగం పరంగా సంక్రమించిన మానవహక్కులకు ఎలాంటి విఘాతం కలుగకుండా చూడటం.

సంస్థ ముఖ్యోద్దేశ్యము

  1. వ్యభిచార నిరోధక చట్టం(1956): మహిళలను వ్యభిచార రొంపిలోకి లాగకుండా ఇది రక్షణ కల్పిస్తుంది.
  2. మహిళల అసభ్య ప్రదర్శన నిరోధక చట్టం(1986): మహిళలను కించపరిచేలా విధంగా అడ్వర్టయిజ్‌మెంట్‌, బొమ్మలు, రాతలు, నగ్న చిత్రాలు మొదలైనవి దీని ద్వారా నిరోధించారు.
  3. సతి నిరోధక చట్టం(1987): భర్త మరణిస్తే అతడి భౌతికకాయంతో పాటు భార్యను బలవంతంగా చితిపై దహనం చేసే అనాగరిక చర్య నుంచి మహిళలకు ఇది రక్షణ కల్పిస్తుంది.
  4. వరకట్న నిషేధ చట్టం(1961): వివాహానికి ముందుకానీ, వివాహం తర్వాత కానీ వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడాన్ని ఇది నిషేధిస్తుంది.
  5. గర్భ నిరోధక నివారణ చట్టం(1971): మహిళల ఇష్టానికి వ్యతిరేకంగా గర్భవిచ్ఛిత్తికి ఒత్తిడి చేయకుండా వారికి ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది.
  6. ముస్లిం వివాహాల రద్దు చట్టం(1939): స్ర్తీలకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది.
  7. విడాకులు పొందిన ముస్లిం మహిళల రక్షణ చట్టం(1939)

  1. ఇండియన్ పీనల్ కోడ్ -1860
  2. నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ)- 2013
  3. ఇండియన్ పోలీస్ చట్టం -1861
  4. భారతీయ సాక్ష్యాల చట్టం – 1872
  5. భారతీయ పేలుడు వస్తువుల చట్టం – 1884
  6. క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974అమలులోకి) – 1896
  7. ఖైదీల గుర్తింపు చట్టం – 1920
  8. నష్ట పరిహారాల చెల్లింపు చట్టం -1923
  9. ఇండియన్ వారసత్వ చట్టం -1925
  10. వర్తక సంఘాల చట్టం – 1926
  11. డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ – 1930
  12. వేతనాల చెల్లింపు చట్టం – 1936
  13. మోటర్ వాహనాల చట్టం – 1939
  14. ఫ్యాక్టరీ చట్టం – 1948
  15. ఉద్యోగుల భవిష్యనిది చట్టం – 1952
  16. ఆహార కల్తీ నివారణ చట్టం – 1954
  1. భారతీయ పౌరసత్వ చట్టం – 1955
  2. నిత్యావసర వస్తువుల చట్టం – 1955
  3. హిందు కోడ్ చట్టం – 1955
  4. పౌర హక్కుల రక్షణ చట్టం – 1955
  5. కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం – 1956
  6. వరకట్న నిషేద చట్టం – 1961
  7. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం – 2002
  8. AP జూద నివారణ చట్టం – 1974
  9. సమాన వేతన చట్టం – 1976
  10. వెట్టిచాకిరి రద్దు చట్టం – 1976
  11. ఫ్యామిలీ కోర్టు చట్టం – 1984*
  12. బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం – 1986
  13. వినియోగదారుల రక్షణ చట్టం – 1986
  14. టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిరోదక చట్టం – 1988
  15. అవినీతి నిరోధక చట్టం – 1988
  16. ఇమ్మోరల్ ట్రాపిక్ (ప్రివెన్షన్ ) చట్టం – 1956